Asianet News TeluguAsianet News Telugu

మాకూ ఆయుధాలివ్వండి.... రేంజర్‌ హత్యతో అటవీశాఖ సిబ్బంది ఆందోళన

పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గుత్తికోయల చేతిలో హత్యకు గురయ్యారు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు. దీంతో అటవీశాఖ సిబ్బంది భగ్గుమంటున్నారు. 

telangana forest department staff demands weapons For Self-defence
Author
First Published Nov 22, 2022, 5:41 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మరణించడంపై అటవీ శాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమకు ఆయుధాలు ఇవ్వాలని ఫారెస్ట్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో వున్న తమపై దాడులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా... మంగళవారం పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాడికి గురైన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చండ్రగుంట మండలం బెండలపాడులో ఈ ఘటన జరిగింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్‌ను హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు పరిస్ధితి ప్రస్తుతం విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కొత్తగూడెం నుంచి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ALso REad:భద్రాద్రి కొత్తగూడెం : వేట కొడవళ్లతో గుత్తికోయల దాడి.. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి

బెండలపాడు సమీపంలోని ఎర్రగూడు అటవీప్రాంతంలో గతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూముల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి గిరిజనులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ జరిగింది. గతంలో లాఠీఛార్జ్ సైతం చేశారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మళ్లీ భూముల్లో అధికారులను నాటిన మొక్కల్ని ధ్వంసం చేశారు గుత్తికోయలు. దానిని అడ్డుకునే క్రమంలో అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది.  ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై గిరిజనులు వేట కొడవళ్లతో దాడులు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios