కొత్త జిల్లాల ప్రకారమే.. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు: ఉపాధ్యాయ నేతలకు కేసీఆర్ హామీ
తెలంగాణలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు, స్కూళ్ల ప్రారంభంపై స్పష్టత వచ్చింది. దీనిపై పీఆర్‌టీయూ నేతలు ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిసి పరిస్దితిని వివరించారు. కరోనా కారణంగా కొన్నాళ్లపాటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు వాయిదా వేయాలని కోరాగా.. సీఎం అందుకు హామీ ఇచ్చినట్లుగా పీఆర్‌టీయూ నేతలు తెలిపారు
తెలంగాణలో టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు, స్కూళ్ల ప్రారంభంపై స్పష్టత వచ్చింది. దీనిపై పీఆర్‌టీయూ నేతలు ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలిసి పరిస్దితిని వివరించారు. కరోనా కారణంగా కొన్నాళ్లపాటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష తరగతులు వాయిదా వేయాలని కోరాగా.. సీఎం అందుకు హామీ ఇచ్చినట్లుగా పీఆర్‌టీయూ నేతలు తెలిపారు. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్ క్లాసులు వుండనున్నట్లుగా చెప్పారు. కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టినట్లుగా సీఎం హామీ ఇచ్చారని పీఆర్‌టీయూ నేతలు తెలిపారు.
మరోవైపు జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. జూలై 1 నుంచి 50 శాతం టీచర్లు హాజరుకానున్నారు. మరో 50 శాతం టీచర్లు మరుసటి రోజు విధులకు హాజరవుతారు. కేవలం 9,10 పదో తరగతులకు మాత్రమే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. అలాగే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి కూడా కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఏ ప్రాతిపదికన బదిలీలు, ప్రమోషన్లు అన్నది త్వరలోనే ప్రభుత్వం నిర్ణయించనుంది.
Also Read:జూలై 1 నుంచి పల్లె ప్రగతి.. ప్రతి ఇంటికి 6 మొక్కలు: అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం
కాగా, తెలంగాణ రాష్ట్రంలో జూలై 1వ తేదీ విద్యా సంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో జూలై 1వ తేదీ నుండి విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఫిబ్రవరి 1 వతేదీన విద్యాసంస్థలను ప్రారంభించింది. కరోనా కేసులు పెరిగిపోవడంతో విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మార్చి 24 నుండి విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కరోనా కేసుల నేపథ్యంలో ఈ ఏడాది మే 12 నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేశారు. ఈ నెల 20 నుండి లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.