కరోనా వైరస్‌: వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్‌పై కేసీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణలో కరోనా (coronavirus) పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ, స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా పట్ల భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేసీఆర్ పేర్కొన్నారు

telangana cm kcr comments on coronavirus

తెలంగాణలో కరోనా (coronavirus) పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ, స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా పట్ల భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరిస్తూ .. భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇస్తామని సీఎం తెలిపారు. ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లకు రేపటి నుంచి బూస్టర్ డోస్ వేస్తారని కేసీఆర్ చెప్పారు. జాగ్రత్తలు పాటిస్తూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సీఎం సూచించారు. 

సాగునీటి ప్రాజెక్ట్‌లు, సచివాలయ పురోగతిపై (irrigation department) సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. గోదావరి (godavari) ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. డీపీఆర్‌లు ఇచ్చి 5 నెలలైనా అనుమతులు రాకపోవడంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మిగతా ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లను త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సెక్రటేరియట్ పనులన్నీ వేగంగా సాగాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ .. అనుబంధ భవన నిర్మాణాల వేగం పెంచాలని మంత్రి వేములను కేసీఆర్ ఆదేశించారు. పోలీసులకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే పోలిస్ కమాండ్ కంట్రోల్ రూమ్  పులు పూర్తి చేయాలని కోరారు. 

కాగా.. శ‌నివారం ఒక్క‌రోజే దేశంలో ల‌క్ష‌న్న‌ర మందికి పైగా వైర‌స్ బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 1,59,377 మందికి Coronavirus సోకింది. రోజువారీ కేసులు లక్ష దాటిన రెండు రోజుల్లోనే 1.5 లక్షలకు చేరుకోవడంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. Covid-19 సేకండ్ వేవ్  స‌మ‌యంలో 2021 మే 30న చివరిసారిగా లక్షన్నర కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలోనే శనివారం రోజువారీ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,55,28,004 పెరిగింది. 

అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ.. 329 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,83,790 కి పెరిగింది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు అదేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరు 31 నాటికి లక్ష ఉన్న Coronavirus యాక్టివ్ కేసులు.. ప్రస్తుతం ఆరు లక్షలకు చేరువ‌య్యాయి. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు 5,90,611గా ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో 40,863 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. 

దీంతో మొత్తంగా క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డిన వారి సంఖ్య 3,44,53,603కు పెరిగింది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.3 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.37 శాతంగా ఉంది. Covid-19 పాజిటివిటీ రేటు 5.3 శాతంగా ఉంది. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. దీనిలో భాగంగా క‌రోనా ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాయి. ఇప్పటివ‌ర‌కు దేశంలో 68,84,70,959 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. శ‌నివారం ఒక్క‌రోజే 15,29,948 Coronavirus శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. 

ఇదిలావుండ‌గా, క‌రోనా రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 41,434 కేసులు వెలుగుచూశాయి. ఇదే స‌మ‌యంలోCovid-19 కార‌ణంగా 13 మంది చనిపోయారు. మ‌హారాష్ట్రలో న‌మోద‌వుతున్న మొత్తం కేసుల్లో అత్య‌ధికం దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోనే న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిన్న ఒక్క ముంబయిలోనే 20,318 కేసులు నమోదయ్యాయి. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ క‌రోనా ప్ర‌భావం పెరుగుతోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios