Asianet News TeluguAsianet News Telugu

పాత చట్టాలను మార్చేస్తున్నాం.. గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరణ అనంతరం కేసీఆర్

గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

Telangana CM KCR comments after flag hoisting in golconda
Author
Hyderabad, First Published Aug 15, 2019, 10:19 AM IST

గోల్కొండ కోటలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవందనాన్ని సీఎం స్వీకరించారు. 

అంతకముందు.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్.. అమరులైన సైనికులకు నివాళులర్పించారు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో సైనిక స్మారక స్థూపం వద్ద సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ కార్యక్రమం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు.

గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 2018-19 సంవత్సరానికి 14.85 శాతం స్థూల జాతీయోత్పత్తిలో ముందున్నామన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో శాంతది, సామరస్యాలు వెల్లువిరిస్తున్నాయన్నారు. ప్రగతి ప్రస్తావాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. గ్రామాలు, పట్టణాలు ఆదర్శంగా తీర్చిదిద్డం కోసం కొత్త చట్టాలతో సంస్కరణలు మొదలుపెట్టామని చెప్పారు. సులభమైన పాలన కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ వివరించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కొత్త జోనల్ వ్యవస్థతోనే ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. సుపరిపాలన కోసం పాత చట్టాలను మారుస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ రంగానికి పెద్ద పీట వేశామన్నారు. 

గోల్కొండలో సంబురంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Follow Us:
Download App:
  • android
  • ios