Asianet News TeluguAsianet News Telugu

850 ఎకరాల్లో ఆలయాభివృద్ధి: కొండగట్టుకు రూ. 500 కోట్లు ప్రకటించిన కేసీఆర్

కొండగట్టు  ఆలయ పునర్మిర్మాణ పనులపై  తెలంగాణ సీఎం  కేసీఆర్  ఇవాళ అధికారులతో  సమీక్ష నిర్వహించారు.   ఆలయ పునర్మిర్మాణం కోసం నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవని  ప్రభుత్వం  తెలిపింది. 
 

Telangana CM KCR Announces Rs. 500 Crore To Kondagattu Temple
Author
First Published Feb 15, 2023, 3:47 PM IST

కరీంనగర్: కొండగట్టు  ఆలయానికి  తెలంగాణ సీఎం  కేసీఆర్   రూ. 500 కోట్లు  కేటాయిస్తున్నట్టుగా  బుధవారం నాడు ప్రకటించారు.  ఇప్పటికే  ఈ ఆలయానికి  రూ. 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

కొండగట్టు ఆలయాన్ని  తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ  సందర్శించారు.  హైద్రాబాద్ నుండి  ప్రత్యేక  హెలికాప్టర్ లో  సీఎం  కేసీఆర్  కొండగట్టుకు  చేరుకున్నారు.  కొండగట్టు ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతపురం  ఆలయాన్ని  పరిశీలించారు.  అనంతరం  అధికారులతో  సీఎం  కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  ఆలయ పునర్మిర్మాణంపై  సీఎం కేసీఆర్  అధికారులతో  చర్చించారు.  ఆలయ పునర్మిర్మాణానికి సంబంధించి  రూ. 500 కోట్లను కేటాయిస్తున్నట్టుగా  కేసీఆర్  చెప్పారు.  గతంలో  ప్రకటించిన  రూ. 100 కోట్లతో కలుపుకొని  మొత్తం  రూ. 600 కోట్లతో  ఆలయ పునర్మిర్మాణ  పనులను  చేపట్టనున్నారు.

రెండు గంటలకు పైగా  అధికారులతో  సమీక్ష

 దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు రావాలని  కేసీఆర్  అధికారులకు సూచించారు.  బుధవారం నాడు కొండగట్టు  హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులపై అధికారులతో  ఆయన సమీక్ష నిర్వహించారు.   ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టు ను తీర్చిదిద్దాలన్నారు.   కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్టుగా  ఆయన  పేర్కొన్నారు.  భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా కొండగట్టు  ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నారు. 

 ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని  ఆయన  కోరారు.   దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టు లో జరగాలని  ఆయన  కోరారు.   హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో  భక్తులకు  ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కేసీఆర్ ఆదేశంచారు.   హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని  సీఎం  సూచించారు.   850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని  సీఎం  ఆదేశించారు.

also read:కొండగట్టు ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు : ఏరియల్ సర్వే

పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ నీ అభివృద్ధి చేయాలని  సీఎం  సూచించారు. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు.  వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని సీఎం అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios