గోదావరి నదీ తీరాన ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అధ్బుతమైన పుణ్య క్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు వెంటనే 100కోట్ల నిధులు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ కు ప్రాణధార అయిన కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్ట్ పూర్తవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని, కాళేశ్వరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉన్నదని సీఎం పేర్కొన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలన లో బాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ని, పార్వతి మాతని దర్శించుకున్నారు దర్శించుకున్నారు.  అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఆలయ అర్చకులతో కాసేపు కూర్చొని మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత దృష్ట్యా ఇకనుండి ఆలయానికి, ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలి వస్తారని దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ కి సూచించారు. 

ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థాలలను అక్వైర్ చెయాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపం తో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించాల్సి వుంటుందని సీఎం అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంలో ఒక మహోత్తరమైన యాగాన్ని నిర్వహించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. 

యజ్ఞ యాగాదులకు గోదావరి  తీరంలోని ఆలయ ప్రాంతం అణువు గా ఉంటుందని,, ఆలయ పుణర్ నిర్మాణానికి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ స్వామి ని ఆహ్వానించినట్లు సీఎం తెలిపారు.  కాళేశ్వరం బ్యారేజీలు అన్ని పూర్తయిన తరువాత గోదావరి జలాలు ధర్మపురి లక్ష్మి నరసిహ్మ స్వామి పాదాలకు తాకే వరకు సుమారు 170 కిలోమీటర్లు నిలిచి ఉంటాయని తెలిపారు. 

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దయవల్ల ఈ ప్రాజెక్ట్ ద్వారా 45లక్షల ఎకరాలకు రెండు పంటలకు సమృద్ధిగా సాగు నీరు అందివ్వనున్నట్లు సీఎం వివరించారు. ఉద్యమ కాలంలో రామగుండం దగ్గర గోదావరి ని చూస్తే దుఖం వచ్చేదని, తెలంగాణకు తరలి రావాలని  మొక్కుతూ గోదావరి నదిలో నాణేలు జార విడిచే వాడినని, ఇప్పుడు తెలంగాణలో కష్టాలు తీరబోతున్నయని సీఎం పేర్కొన్నారు. 

అర్చకుల కోసం క్వార్టర్స్ నిర్మిస్తామని , వేద పాఠశాల, కళాశాల తో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. గోదావరి పుష్కర ఘాట్స్ దగ్గర జాలిలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ముఖ్యమంత్రి దంపతుల తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్.కె జోషి, సీఎం ఓ అధికారి స్మిత సభర్వాల్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, దాసరి మనోహర రెడ్డి, ఎమ్మెల్సీ లు నారదాసు లక్ష్మణ రావు, భాను ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, దేవసేన, కరీంనగర్  జెడ్పీ చైర్మన్ తుల ఉమ, కార్పొరేషన్ల చైర్మన్లు దామోదర్ రావు, ఈద శంకర్ రెడ్డి మరియు ఆలయ చైర్మన్ బొమ్మర వెంకటేశం, ఈఓ మారుతి , సర్పంచ్ వసంత తదితరులు పాల్గొన్నారు.