Asianet News TeluguAsianet News Telugu

మల్లుభట్టి విక్రమార్కకు కోవిడ్: హొం ఐసోలేషన్ లో సీఎల్పీ నేత


తెలంగాణ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు  కరోనా సోకింది. ఆయన హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. భట్టి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Telangana CLP leader Mallu bhatti vikramarka tests corona positive
Author
Hyderabad, First Published Jan 16, 2022, 8:29 PM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు Corona పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు ప్రకటించారు.Clp నేత Mallu bhatti vikramarka ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని  సీఎల్పీ నేత సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆందోళన చెందొద్దని మల్లుభట్టి విక్రమార్క కోరారు. Home Quarantine నుంచి బయటకు వచ్చిన తరువాత కార్యకర్తలను కలుస్తానని  ఆయన ప్రకటించారు .

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.ఇప్పటికే విద్యా సంస్థలకు  ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది kcr సర్కార్. ఈ నెల 17న Telangana Cabinet సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కరోనాపై కఠిన ఆంక్షలు తీసుకొనే అవకాశం ఉంది.

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,71,202 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,71,22,164కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.  కరోనాతో మరో 314 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,86,066కి చేరింది. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3,50,85721కి చేరింది.  నిన్న కరోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,50,377 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక, దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు.. 13.69 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.51 శాతం, యాక్టివ్ కేసులు.. 4.18 శాతంగా ఉంది. ఈ నెల 15 న  దేశంలో 16,65,404 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,24,48,838కి చేరినట్టుగా తెలిపింది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 66,21,395 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,56,76,15,454కి చేరింది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios