Asianet News TeluguAsianet News Telugu

జగదీష్ రెడ్డి సవాల్, రేవంత్ సై: ఛత్తీస్ ఘడ్... భద్రాద్రి, యాద్రాద్రి పవర్ ప్లాంట్లపై జ్యుడీషియల్ విచారణ

తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై  అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ సమయంలో  గత ప్రభుత్వంలో చేపట్టిన అంశాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 

Telangana chief minister Anumula Revanth Reddy orders judicial inquiry on Power plants lns
Author
First Published Dec 21, 2023, 12:56 PM IST

హైదరాబాద్:ఛత్తీస్ ఘడ్  నుండి విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అక్రమాలపై విచారణ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ విషయాలపై  జ్యుడిషీయల్ విచారణ చేయిస్తామని  సీఎం రేవంత్ రెడ్డి  తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన  జగదీష్ రెడ్డి జ్యుడిషీయల్ విచారణకు సవాల్ చేశారన్నారు.ఈ సవాల్ ను స్వీకరిస్తున్నామన్నారు.  ఈ మూడు అంశాలపై  జ్యుడిషీయల్ విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం అనుముల రేవంత్ రెడ్డి  ప్రకటించారు.  

మూడు అంశాలపై  న్యాయ విచారణకు  ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  తెలంగాణ అసెంబ్లీలో గురువారంనాడు ప్రకటించారు. వ్యవసాయ విద్యుత్ అనేది పెద్ద సెంటిమెంట్ అని ఆయన గుర్తు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  చేసిన  సవాల్ ను స్వీకరిస్తున్నామన్నారు. 

తెలంగాణ అసెంబ్లీలో  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  గురువారంనాడు విద్యుత్ పై శ్వేత పత్రం ప్రవేశ పెట్టారు.ఈ శ్వేత పత్రంపై చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి  చేసిన సవాల్ పై  సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

వ్యవసాయ విద్యుత్ అనేది పెద్ద సెంటిమెంట్ అని ఆయన చెప్పారు.వాస్తవాలు చెప్పిన ఓ ఉద్యోగి హోదాను గత ప్రభుత్వం తగ్గించిందని  సీఎం రేవంత్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో  కీలకపాత్ర పోషించిన ఉద్యోగిని గత ప్రభుత్వం శిక్షించిందని  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఛత్తీస్‌ఘడ్ తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని రేవంత్ రెడ్డి  చెప్పారు. ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి  చెప్పారు. 

ఛత్తీస్ ఘడ్  నుండి విద్యుత్ కొనుగోళ్లు,  యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల విషయమై  జ్యుడిషీయల్ విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అంశంపై  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  శ్వేత పత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విచారణకు సవాల్ చేశారు.ఈ సవాల్ పై  ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు.

ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి  చెప్పారు. భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారని సీఎం రేవంత్ రెడ్డి  ఆరోపించారు. తాము వద్దని చెబుతున్నా సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.ప్రజల సెంటిమెంట్ ను ఆధారంగా చేసుకుని ఒప్పందాలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి  చెప్పారు.ఈ ఒప్పందాలతో ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాలం చెల్లిన టెక్నాలజీని వాడి రూ. 10 వేల కోట్లు వెచ్చించి రాష్ట్రాన్ని ముంచారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి  చెప్పారు.  యాదాద్రి ప్రాజెక్టు ఎనిమిదేళ్లైనా పూర్తి కాలేదన్నారు.  ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కూడ జ్యుడీషియల్ విచారణ చేయించనున్నట్టుగా రేవంత్ రెడ్డి  ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి  ఈ విషయమై  ప్రకటించగానే  తనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చేసిన ఆరోపణలపై కూడ విచారణ చేయాలని  మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  సీఎంను కోరారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios