తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్‌లోని సెయింట్ అగస్టీన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భార్యతో కలిసి రజత్ కుమార్ ఓటు వేశారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల జాయింట్ సెక్రటరీ ఆమ్రపాలి బంజారాహిల్స్‌ రోడ్ నెం.7లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని రజత్ కుమార్ తెలిపారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి టోల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.  

ఈటెల కుటుంబీకుల ఓట్ల గల్లంతు

వంశీచంద్‌రెడ్డిపై దాడి మా దృష్టికి వచ్చింది: సీఈసీ రజత్ కుమార్

పోలింగ్ సిబ్బంది నిర్వాకం: లంచ్ టైం అంటూ పోలింగ్ కేంద్రానికి తాళం

పోలింగ్ సమయం పెంచేదిలేదు.. రజత్ కుమార్

ఓటర్లకు బంపర్ ఆఫర్, టోల్ ప్లాజా రద్దు:సిఈవో