హైదరాబాద్‌: తెలంగాణ ఓటర్లకు రాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి టోల్ ప్లాజా రుసుం ను ఒక్కరోజు రద్దు చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కుటుంబ సభ్యులతో రాష్ట్రంలో ప్రవేశిస్తున్న వారికి టోల్ ప్లాజా వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫ్ జాం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలింగ్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ టోల్ ప్లాజా రుసుం ఒక్కరోజు రద్దు చెయ్యాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఈ నేపథ్యంలో ఈ ఒక్కరోజు టోల్ ప్లాజా రుసుంను రద్దుచేశారు. 

అసెంబ్లీ ఎన్నిక​ల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈరోజు వాహనదారులకు టోల్‌ప్లాజా రుసుం చెల్లింపు నుంచి ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.