Telangana Cabinet: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ముఖ్య అంశాలపై చర్చింది. ఇందిరమ్మ ఇళ్లు, వానాకాలం పంటలు, రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం, భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు సహా పలు కీలక సంక్షేమ పథకాలపై చర్చించారు.

Telangana Cabinet meet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలపై చర్చించారు.

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, వానాకాలం పంటల సాగు, భూ భారతి సహా పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులు సమగ్రంగా సమీక్షించారు. గ్రామీణ యువతకి ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తూ రాజీవ్ యువ వికాసాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే అంశంపై చర్చ సాగింది.

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు 

తెలంగాణ క్యాబినెట్ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు సాగింది. ఉద్యోగులకు డీఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల క్లియర్‌చేయడం, ఇండస్ట్రీల్లో ఇన్ఫ్రా, స్థానిక‌ సంస్థల ఎన్నికల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశం మంత్రులు మీడియాతో కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

  • మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రమాద, లోన్ బీమా చెల్లింపునకు రూ.70 కోట్లు కేటాయింపులు
  • ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయింపు
  • జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఆథారిటీ ఏర్పాటు
  • విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకానికి గ్రీన్ సిగ్నల్
  • ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఆమోదం
  • పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాలో ప్రభుత్వ భూములను TGIIC బదిలీకి ఆమోదం

రెండు డీఏల చెల్లింపు:

  • కేబినెట్‌లో ఉద్యోగ సంఘాల డిమాండ్లపై చర్చించి, రెండు డీఏలు (Dearness Allowance) చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
  • ఒక డీఏ ఇప్పుడే చెల్లిస్తారు.
  • రెండవ డీఏని ఆరు నెలల తర్వాత చెల్లిస్తారు.

ఆరోగ్య బీమా ట్రస్ట్ ఏర్పాటు

  • ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
  • ఉద్యోగులు ప్రతి నెలా ₹500 చెల్లిస్తారు.
  • ప్రభుత్వం కూడా వాటా చెల్లిస్తుంది.
  • ఈ నిధులను ట్రస్ట్‌లో జమ చేసి, ఉద్యోగులకు వైద్య అవసరాల సమయంలో ఆర్థిక సహాయం అందిస్తారు.

ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు

  • ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రతినెలా కనీసం ₹700 కోట్ల మేర చెల్లిస్తారు.
  • నెలల వారీగా బకాయిలను క్లియర్ చేస్తారు.

పదవీకాల పొడిగింపుపై స్పష్టం

  • ఇకపై రిటైర్ అయిన ఉద్యోగులకు పదవీకాల పొడిగింపు ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మహిళా సంఘాల సభ్యులకు మృతిపరిహారం

గతేడాది మృతి చెందిన 385 మంది మహిళా స్వయం సహాయక బృంద సభ్యుల కుటుంబాలకు ₹10 లక్షల పరిహారం అందించనున్నారు. 

విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధాని పేరు

  • కొత్తగూడెం లోని ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయానికి డా. మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

హోం విధానంలో రహదారుల ఆధునికీకరణ

  • రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారుల ఆధునికీకరణ చేపట్టనున్నారు.
  • ఆర్‌అండ్‌బీ పరిధిలో 5,100 కిలోమీటర్లు
  • పంచాయతీ రాజ్ పరిధిలో 7,947 కిలోమీటర్లు ఆధునికీకరణ చేస్తారు.