రేపు తెలంగాణ మంత్రిమండలి అత్యవసరంగా భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం కానుంది. లాక్‌డౌన్, గోదావరిలో నీటి ఎత్తిపోత, వానాకాలం సాగుపై మంత్రివర్గం చర్చించనుంది. 

జూన్ 8న సమావేశమైన కేబినెట్ రాష్ట్రంలో మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయనం తీసుకుంది. తొలుత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్ ఆంక్షలకు మినహాయింపు వుండేది. అనంతరం మేనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అయితే గత నెల చివర్లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో లాక్‌డౌన్‌ను జూన్ 9వ తేదీకి పొడిగించింది. అయితే లాక్‌డౌన్ సడలింపులను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఇచ్చారు. 

Also Read:లాక్‌డౌన్ పొడిగింపు, రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలివే..!!

జూన్ 8 నాటి కేబినెట్ భేటీలో లాక్‌డౌన్‌ను పది రోజుల పాటు పొడిగించడంతో పాటు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. అలాగే ఇళ్లకి వెళ్లేందుకు మరో గంట సమయం అదనంగా ఇచ్చింది. రేపటితో లాక్‌డౌన్ పొడిగింపు గడువు ముగియనుండటంతో కేబినెట్ సమావేశం కానుంది.