తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి  భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. 

తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర వైఖరిని ఎండగట్టేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందుకు సంబంధించిన తేదీలను ఖరారు చేసే అవకాశం. అలాగే గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి, ఆమె వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేకంగా చర్చించే అవ‌కాశ‌ముంది. రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సమీక్ష నిర్వహించనుంది.

తెలంగాణ ఈడీ, సీబీఐ దాడులు, పోడు భూములకు పట్టాల పంపిణీ, ఇంటి స్థలం ఉన్న బలహీనవర్గాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం, దళిత బంధు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో.. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.