ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం: బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ ఉదయం ప్రారంభమైంది. రేపు అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం నాడు ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ బడ్జెట్ సుమారు రూ. 3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ టర్మ్ లో ఇదే చివరి బడ్జెట్ . దీంతో ఎన్నికలను పురస్కరించుకొని బడ్జెట్ లో పథకాలు, శాఖలకు కేటాయింపులు ఉండే అవకాశం లేకపోలేదు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న తరహ పథకాలను ప్రవేశ పెట్టిందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టే బడ్జెట్ కావడంతో ప్రజలను ఆకర్షించేందుకు గాను బడ్జెట్ లో కేటాయింపులు ఉండే అవకాశం లేకపోలేదు.
also read:ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం: బడ్జెట్ ఆమోదించనున్న మంత్రివర్గం
ఈ నెల 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టనున్నారు.ఈ నెల 9 నుండి 11 వ తేదీ వరకు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ నెల 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. ద్రవ్యి వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెల 9 నుండి 11 వ తేదీ వరకు శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ నెల 12న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. ద్రవ్యి వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.