రేవంత్ కేబినెట్ చోటెవరికి? హోంమంత్రి అయ్యేదెవరు? 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మళ్లీ చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో మంత్రి పదవిని ఆశిస్తున్నవారు ఎవరెవరో తెలుసుకుందాం. 

Telangana Cabinet Expansion: Key Updates and Speculations AKP

Telangana Cabinet Expansion : ఎప్పటినుండో తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని డిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వస్తుంది. ఆయన తిరిగి తెలంగాణకు రాగానే అధికారిక పనుల్లో భాగంగానే డిల్లీకి వెళ్లానని చెప్పడంతో మంత్రివర్గ విస్తరణపై చర్చ అగిపోతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి డిల్లీకి వెళ్లడంతో కేబినెట్ విస్తరణపై చర్చ మొదలయ్యింది... కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి పరిస్థితి కాస్త వేరుగా కనిపిస్తోంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.  

అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల(డిసెంబర్) 31 లోపు కేబినెట్ విస్తరణ వుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిల్లీ పర్యటన... మంత్రి  పొంగులేటి కామెంట్స్ ను చూస్తుంటే ఈసారి కేబినెట్ విస్తరణ వుండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆశావహుల్లో అలజడి మొదలయ్యింది... మంత్రిపదవి వస్తుందో రాదో అనే టెన్షన్ తో వున్నారు.

ఆశావహుల్లోనే కాదు ప్రస్తుత మంత్రుల్లోనూ ఆందోళన మొదలయ్యిందనే ప్రచారమూ జరుగుతోంది. ఎందుకంటే  కేవలం మంత్రివర్గ విస్తరణే కాదు శాఖల మార్పు కూడా వుండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుత మంత్రులు నిర్వర్తిస్తున్న శాఖల్లో మార్పులు చేర్పులు వుంటాయని... కొత్తవారికి కేబినెట్ లోకి తీసుకుని వారితోపాటే ఇప్పుడున్నవారికి కొత్తశాఖలు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు కొత్తగా మంత్రుల నియామకం,శాఖల కేటాయింపు జరుగుతుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సమావేశం తర్వాతే క్లారిటీ రానుంది. 

రేవంత్ కేబినెట్ చోటెవరికి : 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తుతం హోం, విద్యా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలు వున్నాయి. అలాగే వాణిజ్య పన్నులు,జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ ద్వారా ఈ శాఖలను ఇతరులకు కేటాయించే అవకాశాలున్నాయి. 

రేవంత్ రెడ్డి వున్న కీలకమైన హోం, విద్యాశాఖలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ శాఖలను రేవంత్ తన సన్నిహితులకే కేటాయించే అవకాశం వుంది. కాబట్టి ఇందులో ఏదోఒకటి మంత్రి సీతక్కకు దక్కే అవకాశం వుందనే ప్రచారం ఎప్పటినుండో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆమె పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆమెకు హోంశాఖ దక్కితే తెలంగాణ మొదటి మహిళా హోంమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు.

ఇక సీఎం వద్ద వున్న హోం, విద్యాశాఖలను మరికొందరు సీనియర్లు కూడా ఆశిస్తున్నారు. రేవంత్ సర్కార్ లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హోంశాఖను ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నాయకులు కూడా ఈ పదవిపై కన్నేసినట్లు సమాచారం. విద్యాశాఖను కూడా చాలామంది నాయకులు ఆశిస్తున్నారు.

ఇక రేవంత్ కేబినెట్ లో తమకు చోటు దక్కుతుందని చాలామంది గంపెడు ఆశతో వున్నారు. కొందరు ఏకంగా డిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో వున్నారు. ఇలా కొత్తగా మంత్రిపదవు పొందేవారి లిస్ట్ లో గడ్డం వినోద్, గడ్డం వివేక్, మల్ రెడ్డి రంగారెడ్డి, మదన్మోహన్ రావు,వాకిటి శ్రీహరి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు వంటివారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నారు. వీరిలో ఎవరికి మంత్రిపదవి దక్కుతుందో చూడాలి. 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios