Asianet News TeluguAsianet News Telugu

విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు శుభవార్త: వ్యాక్సినేషన్‌లో వారికి ప్రాధాన్యత... తెలంగాణ సర్కార్ నిర్ణయం

వ్యాక్సినేషన్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్ధులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా విదేశాలకు వెళ్లేందుకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వుంటాయని తెలిపింది

telangana Cabinet decided to vaccination on priority for Students who going overseas ksp
Author
Hyderabad, First Published May 30, 2021, 7:18 PM IST

వ్యాక్సినేషన్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్ధులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా విదేశాలకు వెళ్లేందుకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వుంటాయని తెలిపింది. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

దీనితో పాటు రాష్ట్రంలో కొత్తగా మరో 7 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంగారెడ్డి, జగిత్యాల, వనపర్తి, మహబూబాబాద్, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, మంచిర్యాలలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతూ.. మందుల దొరక్క ఇబ్బందిపడుతున్న వారు తగిన వివరాలతో dme@telangana.Gov.in, ent-mcrm@telangana.Gov.inలకు మెయిల్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

Also Read:తెలంగాణలో జూన్ 10 వరకు లాక్‌డౌన్ ... మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు

అంతకుముందు తెలంగాణలో మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్‌.. మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  అయితే సడలింపు సమయాన్నిమూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. అన్ని వైపుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో దానిని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios