Asianet News TeluguAsianet News Telugu

' రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది': ప్రారంభమైన తెలంగాణ కేబినెట్

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్ రావు కేబినెట్ కు వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని మంత్రి చెప్పారు.

Telangana Cabinet Begins at Pragati Bhavan in Hyderabad
Author
Hyderabad, First Published Jan 17, 2022, 3:09 PM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Harish Rao  చెప్పారు.Telangana Cabinet సమావేశం సీఎం Kcr అధ్యక్షతన సోమవారం నాడు Pragati Bhavan లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. సమావేశం ప్రారంభం కాగానే రాష్ట్రంలోCorona  పరిస్థితులపై కేబినెట్ కు మంత్రి హరీష్ రావు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్య  ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ఆదివారం నాడు రాష్ట్రంలో  రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ లో చర్చించనుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు Holidays ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు పొడిగించారు.  

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం  కఠిన ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. night curfew విధించాలా లేదా కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలా అనే విషయమై రాష్ట్ర కేబినెట్ లో చర్చించనున్నారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై High Court  సోమవారం నాడు విచారణ చేపట్టింది.  ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. 

 ప్రతి రోజూ లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలనిత హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో క‌రోనా నియ‌మ నిబంద‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. అలాగే.. భౌతికదూరం, మాస్కులు ధ‌రించ‌డం వంటి నిబంధ‌న‌లను క‌ఠిన‌త‌రం చేయాల‌ని సూచించారు. 

రోజురోజుకు క‌రోనా వ్యాప్తి వేగ వంతం అవుతున్న త‌రుణంలో నియంత్రణ చ‌ర్య‌ల‌ను క‌ఠిన‌త‌రంగా అమలు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.  కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు Advocate General హైకోర్టుకు తెలిపారు. స‌మావేశ పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios