Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక బైపోల్: తెలంగాణలో మారుతున్న సమీకరణాలకు కారణమిదీ...

సిద్దిపేట ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యతలోకి రావడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు నిదర్శనంగా  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Telangana bypolls:bjp upper hand on congress in Telangana lns
Author
Dubbaka, First Published Nov 10, 2020, 3:33 PM IST

సిద్దిపేట: సిద్దిపేట ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యతలోకి రావడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు నిదర్శనంగా  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నీళ్లు, నిధులు, నియామాకాలు అనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పై నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొంది.

అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన సమయంలో ఆశించిన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

విపక్షాల విమర్శలను అంతేస్థాయిలో టీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు.  స్వంత రాష్ట్రం ఏర్పాటైనా తర్వాత కూడ ప్రభుత్వ ఉద్యోగాల నియామాకాల కోసం నిరుద్యోగులు కాంపీటీటీవ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఆశించిన మేరకు నియామాకాలు జరగలేదనే అసంతృప్తి నిరుద్యోగుల్లో ఉందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. 

హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి  దేవీప్రసాద్  ఓటమి పాలయ్యాడు.ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు విజయం సాధించాడు. ఈ రెండు ఎన్నికల ఫలితాలు యువత టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తమ తీర్పును ఇచ్చారని  విపక్షాలు చెబుతున్నాయి.
 
అదే విధంగా గతంలో జరిగిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన చంద్రశేఖర్ గౌడ్ ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మాజీ మంత్రి జీవన్ రెడ్డి విజయం సాధించాడు. 

వచ్చే ఏడాదిలో  నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి  ఎన్నికలు జరగనున్నాయి.దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి బీజేపీ దూసుకు పోవడం కూడ ఒక రకంగా యువతను ఆ పార్టీ ఆకర్షించిందనే చెప్పకనే చెప్పింది.

రానున్న రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. టీడీపీకి ఒక్క స్థానం దక్కితే. బీజేపీకి 5 స్థానాలు మాత్రమే దక్కాయి.

సుమారు కోటికిపైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా బీజేపీ భావిస్తోంది. 

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టే ప్రయత్నం చేశారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి.

also read:దుబ్బాక బైపోల్: కేసీఆ ర్‌కి మల్లన్నసాగర్ నిర్వాసితుల దెబ్బ

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలకు దక్కించుకొంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కుంచుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కు నెట్టివేయబడింది.దీంతో బీజేపీ ముందుకు వచ్చింది.

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరారు. ఇది కూడ కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. కాంగ్రెస్ నుండి కొందరు నేతలు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వడంలో సక్సెస్ కాలేదు. ఇది కూడ కాంగ్రెస్ కు నష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios