తెలంగాణ బడ్జెట్ 2024: ఆరు గ్యారంటీలకు రూ.53, 196 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ లో ఎన్నికల హామీలపై సర్కార్ బడ్జెట్ లో నిధులను కేటాయించింది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో శనివారంనాడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. రూ. 2,75,891 కోట్లతో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
2023 నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారంటీలు దోహాదపడ్డాయి.
also read:ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు హామీలను అమలు చేసింది. మరో రెండు హామీలను అమలు చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు. మరో వైపు మహిళలకు గ్యాస్ సిలిండర్ ను రూ. 500లకు ఇవ్వనున్నట్టుగా హామీ ఇచ్చింది. మరో వైపు గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ ను ఉచితంగా ఇవ్వనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ రెండు హామీల అమలుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణను సిద్దం చేస్తుంది.
also read:రూ. 2, 75,891కోట్లతో తెలంగాణ బడ్జెట్ : హెలైట్స్ ఇవీ..
ఇప్పటికే ప్రజా పాలన కింద ధరఖాస్తులను స్వీకరించింది.ఈ ధరఖాస్తులను కంప్యూటరీకరించారు. ఈ డేటా ఆధారంగా లబ్దిదారులను గుర్తించి ఈ రెండు హామీలను అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ రెండు హామీలను అమలు చేసే అవకాశం ఉంది. ఆరు హామీల కోసం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 53, 196 కోట్లను కేటాయించింది.పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఆరు హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది