Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్.. వారికి మరోసారి మొండి చేయి..!

కరోనా, పతనమవుతున్న చమురు ధరలకు తోడుగా శరవేగంగా వస్తున్న ఉద్యోగాల స్ధానికరణ తదితర కారణాల వల్ల పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీయులు తిరిగి వస్తున్న నేపథ్యంలో బడ్జెటుపై నిరాశ నెలకొంది.

Telangana budget 2021: No allocation for Gulf expacts
Author
Hyderabad, First Published Mar 18, 2021, 2:58 PM IST

తెలంగాణ ప్రభుత్వం గురవారం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ బడ్జెట్ లో గల్ఫ్ ప్రవాసులకు ప్రభుత్వం మొండి  చేయి చూపించింది.గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గత ఆరేళ్లుగా చెబుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరా బడ్జెట్ వచ్చే సరికి మొండి చేయి చూపుతోంది. 

ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఈసారి 2021-22 బడ్జెట్‌‌లో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి కేరళ తరహా విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం తన పాత పాటను వల్లించింది తప్ప ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్‌తో సహా టీఆర్ఎస్‌ అనేక మంది కీలక నేతలు ఈసారి బడ్జెట్‌‌లో గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో మాత్రం ఏలాంటి కేటాయింపులు చేయలేదు. 

కరోనా, పతనమవుతున్న చమురు ధరలకు తోడుగా శరవేగంగా వస్తున్న ఉద్యోగాల స్ధానికరణ తదితర కారణాల వల్ల పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీయులు తిరిగి వస్తున్న నేపథ్యంలో బడ్జెటుపై నిరాశ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios