వేలం వేసిన రెండు రోజుల్లోనే రూ.7,120 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయంటే తెలంగాణ బాండ్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
బంగారు తెలంగాణ మాట ఏమో గాని తెలంగాణ బాండ్లు మాత్రం బంగారు బాతుగుడ్లుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు విడుదల చేసిన సెక్యూరిటీ బాండ్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
వేలం వేసిన రెండు రోజుల్లోనే రూ.7,120 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయంటే తెలంగాణ బాండ్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులను తీర్చడానికి సర్కారు ఈ బాండ్లను జారీ చేసింది. రూ. 9 వేల కోట్లు లక్ష్యంగా బాండ్ల అమ్మకానికి ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే 7 వేల కోట్లు సమీకరించింది.
రిజర్వే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఈ బాండ్ల వేలంలో చాలా సంస్థలు తెలంగాణ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. దీంతో ధర బాగా పెరిగింది.