నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామలో ఆదివారం అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు కాలువలో శవాలై కనిపించారు. ఆదివారం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు తిరిగి ఇంటికి రాలేదు. ఎంతగాలించినా ఆచూకీ దొరకలేదు. కాగా.. చివరకు కాలువలో శవమై కనిపించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.... నిజామాబాద్‌ జిల్లా రెం జల్‌ మండలంలోని పేపర్‌మిల్‌ గ్రామంలో  ఆదివారం ఉదయం ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. గ్రామానికి చెందిన గౌ తమ్‌, పూజ దంపతుల కుమారులైన సిద్దార్థ్‌(8), దీప క్‌(6), జలాల్‌ కుమారుడైన హుజూర్‌(6) గ్రామంలో ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం ఇం ట్లో చెప్పి ఊరి చివరన ఉన్న నేరేడు పండ్ల చెట్టు వ ద్దకు వెళ్లారు. 

Also Read రైలులో పరిచయం... ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి....

సాయంత్రం వరకు పిల్లలు తిరిగి రాక పోవడంతో తల్లిదండ్రులు వారి కోసం వెతకగా ఆచూ కీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు వా రు కూడా పిల్లల ఆచూకీ కోసం వెతికారు.  సిద్ధార్థ్‌, దీపక్ లు సొంత అన్నదమ్ములు కాగా మరో బాలుడు అదృశ్యం కావడంతో గ్రామస్థులు ఆందోనకు గురయ్యారు.

కాగా... సోమవారం ముగ్గురు చిన్నారులు కాలువలో శవాలై కనిపించారు. కాగా.. చిన్నారులు ఎలా చనిపోయారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.