రైలులో పరిచయమయ్యాడు. ఆమె అవసరాన్ని గుర్తించాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు.  అతని మాటలు ఆమె నిజమేనని అనుకుంది. తీరా అదును చూసుకొని సదరు యువతిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంగటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....మహారాష్ట్ర బుసావాల్ కి చెందిన ఓ యువతి(24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. చర్లపల్లి రైల్వే కాలనీకి చెందిన వివేకానంద(42) రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను పనిమీద ప్రతి 15 రోజుకు ఒకసారి మహారాష్ట్ర వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో అతనికి సదరు యువతి పరిచయమైంది.

తాను ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు ఆమె చెప్పడంతో...త ాను ఇప్పిస్తానని... హైదరాబాద్ రావాలని చెప్పాడు. అతను చెప్పిన మాటలను సదరు యువతి నిజమని నమ్మేసింది. సదరు యువతి ఈ నెల 18వ తేదీన ఉదయం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్ కి చేరుకుంది.  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసింది. శనివారం రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ యువతిని కారులో ఎక్కించుకున్నాడు.

Also Read పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను తల్లిని చేశాడు...

కారులోనే స్నేహితుడితో కలిసి మద్యం సేవించాడు. యువతికి బలవంతంగా మత్తుమందు కలిపిన కొన్ని పదార్ధాలను తినిపించారు. మత్తులోకి జారుకున్న మహిళను ఓ హోటల్ కి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా.... తనపై జరిగిన దారుణాన్ని మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తించిన యువతి... ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు.