BJP workers protest: టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను ఉర్దూలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ ఆందోళనకు దిగింది. భారతీయ జనతా యువ మోర్చా (బీజేపీవైఎం) సభ్యులు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.
Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలను ఉర్దూలోనూ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించంపై భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై బీజేపీ కీలక నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు రాష్ట్ర రాజధానిలో ఆందోళనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉర్దూలో కూడా పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రూప్-1 పరీక్షలను ఉర్దూ మాధ్యమంలో నిర్వహించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన మిత్రపక్షమైన AIMIM పార్టీ ఒత్తిడి మేరకు ఉర్దూ మాధ్యమంలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించిందని, ఇది సమాజంలోని ఒక వర్గానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంగా స్పష్టంగా ఉందని ఆరోపించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హిందువులకు గ్రూప్-1 పోస్టులు వచ్చే అవకాశాలను దెబ్బతీస్తుందని కూడా వారు పేర్కొన్నారు. గత కొంత కాలంగా గ్రూప్-1 పరీక్షల్లో ఉర్దూ చేరిక అంశం బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం సృష్టించింది. కరీంనగర్ ఎంపీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం ఉర్దూ మాధ్యమంగా ఎంచుకున్న అభ్యర్థులను తొలగిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ఆదివారం కాషాయ పార్టీ డిమాండ్‌పై స్పందిస్తూ.. ఉర్దూ కూడా భారత రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన అధికార భాష అని, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం వల్ల సమస్య ఏమిటని ప్రశ్నించారు.
అంతకు ముందు ఇదే విషయంపై భారతీయ జనతా పార్టీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతించడంపై ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రూప్ 1 పోస్టులకు ఉర్దూ భాషలో పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తన ఓటు బ్యాంకు కోసం మైనారిటీ వర్గాన్నిఇలా ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
అరవింద్ వీడియాతో మాట్లాడుతూ.. "ఇది విపరీతమైన చర్య. ముస్లింలను మభ్యపెట్టడం ఉద్దేశం. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాసిన గ్రూప్-1 పరీక్షను హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు ఎవరైనా సరిచేయవచ్చు. ఉర్దూలో రాసిన పరీక్షను ముస్లిం మాత్రమే సరిదిద్దగలరు" అని అన్నారు.ఇది ఆయా వర్గాల వారికి అనుకూలించే అవకాశాలున్నాయని ఆరోపించారు. ఇటీవల, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లీష్ మరియు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా సమాధానాలు రాయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీనిపై ఎంపీ ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థి, మూల్యాంకనం చేసేవారు ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కావడంతో ఇటువంటి చర్య అనుకూలతను ప్రోత్సహిస్తుందని.. ఇది పారదర్శకతను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు.
