Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ కార్యాలయం ముందు నిప్పంటించుకున్న శ్రీనివాస్ మృతి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యలయం ముందు నిప్పంటించుకున్న శ్రీనివాస్ చికిత్స పొందుతు యశోదా హాస్పిటల్ లో మృతి చెందాడు. 

Telangana BJP worker attempts self-immolation at party HQ, Dead - bsb
Author
Hyderabad, First Published Nov 5, 2020, 2:39 PM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యలయం ముందు నిప్పంటించుకున్న శ్రీనివాస్ చికిత్స పొందుతు యశోదా హాస్పిటల్ లో మృతి చెందాడు. 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ అనే యువకుడు ఆదివారం నాడు బీజేపీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. 

సిద్దిపేటకు వెళ్తున్న సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. 

పెట్రోల్ పోసుకొని శ్రీనివాస్ నిప్పంటించుకొన్నాడు. వెంటనే మంటలు ఆర్పి శ్రీనివాస్ ను హాస్పిటల్ కు తరలించారు. 40 శాతం శ్రీనివాస్ కాలిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.

శ్రీనివాస్ ది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంగా గుర్తించారు. ఎందుకు కాల్చుకున్నావ్ అని అడిగితే బండి సంజయ్ అంటే నా ప్రాణం అంటున్నాడు. అంతేకాదు తన గుండె కోసి ఇస్తానని ఆయన చెప్పాడు. పార్టీ కోసం ప్రాణాలు కూడ ఇస్తానని చెప్పాడు.

బండి సంజయ్ అరెస్ట్ చేసిన రోజున తన ఆరోగ్యం బాగా లేనందున తాను ఆ రోజు రాలేకపోయినట్టుగా ఆయన చెప్పారు. ఆదివారం హైద్రాబాద్ కు వచ్చిన ఆయన పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios