తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్ ఆరోపించారు. ఆ డబ్బులలో కాంగ్రెస్ పార్టీ భారీ ెత్తును ప్రచారం నిర్వహిస్తోందన్నారు. అయితే బిజెపికి లభిస్తున్న ప్రజాధరణ చూసి మహాకూటమి నాయకులు రాహుల్, చంద్రబాబు లతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఆందోళన మొదలయ్యిందని లక్ష్మణ్ అన్నారు. 

  జాతీయస్థాయి అగ్ర నాయకుల చేత ప్రచారంలో భాగంగాదాదాపు 50 కి పైగా సభలు, ప్రచార కార్యక్రమాలను తెలంగాణ బిజెపి పార్టీ నిర్వహించిందన్నారు. ఈ సభలకు తెలంగాణ ప్రజల నుండి విశేష ఆదరణ రావడం చూసి ప్రధాని మోదీతో పాటు పార్టీ జాతీయాధ్యక్షులు అమిత్ షా కూడా ఆనందం వ్యక్తం చేశారన్నారు. తమ పార్టీ అభ్యర్థులు కూడా  చాలా బలంగా వున్నారు...కాబట్టి అత్యధిక సీట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోందిని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రతి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యిందని...తెలంగాణలోనూ అదే గతి పడుతుందన్నారు. కుటుంబ పాలనకు దూరంగా ఉండే బిజెపి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.  ఎన్నికల అధికారులు నిస్పక్షపాతంగా ప్రజాస్వామ్యయుతంగా తమ విధులు నిర్వహించాలని లక్ష్మణ్ సూచించారు.