Asianet News TeluguAsianet News Telugu

వారికి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ మా పోరాటం ఆగ‌దు: బండి సంజ‌య్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న జీవో నంబర్‌ 317 కి వ్య‌తిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆ జీవో ఉద్యోగులకు గుదిబండగా మారింద‌నీ,  ఈ జీవోకు వ్య‌తిరేకంగా  నిరంతరంగా పోరాటం చేస్తామ‌ని, ఉద్యోగ,ఉపాధ్యాయులకు అండగా నిలుస్తామని బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా వరంగల్‌లో సభను నిర్వహించింది బీజేపీ. ఈ సభకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హాజర‌య్యారు.   
 

telangana bjp president bandi sanjay fires on telangana cm
Author
Hyderabad, First Published Jan 10, 2022, 5:17 AM IST

 తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న 317 జీవో ఉద్యోగులకు గుదిబండగా మారింద‌నీ, వెంట‌నే ఆ జీవో ను ర‌ద్దు చేయాల‌ని లేదంటే..   పోరాటం చేస్తామ‌ని, ఉద్యోగ,ఉపాధ్యాయులకు అండగా నిలుస్తామని ప్ర‌క‌టించింది బీజేపీ. ఇందులో భాగంగా వరంగల్‌లో సభను నిర్వహించింది బీజేపీ. ఈ సభకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హాజర‌య్యారు.   

ఉద్యోగుల బదిలీలపై విడుదల చేసిన జీవో 317ను సవరించాలని , లేదంటే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దశలవారీగా కేసీఆర్ సర్కార్‌పై పోరును ముమ్మ‌రం చేస్తామ‌ని బండి సంజ‌య్ హెచ్చరించారు.
ఈ స‌మావేశంలో బండి సంజ‌య్  కేసీఆర్, టీ స‌ర్కార్ పై విమ‌ర్శాస్త్రాలు సంధించారు. కేసీఆర్ త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు రూ.లక్షల కోట్ల ఆదాయం ఉంటే తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చర‌ని విమ‌ర్శించారు. ప్రత్యేక తెలంగాణని వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో కేసీఆర్ పొత్తులకు ఉర్రూతలూగుతున్నారని మండిపడ్డారు. 10వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రం దిగజారిపోయిందని విమ‌ర్శించారు.  

 ఉద్యోగ సంఘాల నేతలు మౌనం వీడి ఉద్యోగులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము చాలా రోజుల నుండి 317 జీవోను సవరించాలని పోరాడుతున్నామ‌నీ, సీఎం కేసీఆర్ సోయిలోకి రావాలని.. తాము   దీక్ష చేస్తుంటే.. గ్యాస్‌ కట్టర్లు, గునపాలు పెట్టి గేట్లు బద్ధలు కొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష‌ను భ‌గ్నం చేయ‌డం వ‌ల్ల ఏం సాధించారని నిల‌దీశారు.   

ఇప్పటికైనా 317 జీవోను సవరించాలి డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్‌ఘడ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ ఇక్కడకు వచ్చారన్నారు. 

 ఈ సంద‌ర్భంగా అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మ మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణను ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఒక కుటుంబం కోసమే పని చేస్తుందని అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మ విమర్శించారు. తెలంగాణ కంటే అసోం చిన్న రాష్ట్రమైనా తాము అద్భతంగా పనిచేస్తున్నామని అన్నారు. తమ రాష్ట్రంలో మరిన్ని అద్భుతాలు చేసేవాళ్లం అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగురవేస్తామని బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను ఎన్నింటిని పరిష్కరించారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios