ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కలలో కూడా దుబ్బాకే గుర్తుకొస్తుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హరీశ్ రావు లేఖ  నేపథ్యంలో ఆయన స్పందించారు.

దుబ్బాక చౌరస్తాలో సీఎం కేసీఆర్‌తో తాను చర్చకు రెడీ అని బండి స్పష్టం చేశారు. అబద్ధాల్లో కేసీఆర్‌కు ఆస్కార్ ఇవ్వాలని.. రేపు ఫ్రంట్ పేజీలో వార్త రావాలని మంత్రి హరీశ్ రావు లేఖ రాశారని సంజయ్ సెటైర్లు వేశారు.

మరోవైపు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ యువకుడు ఒంటికి నిప్పంటించుకున్నాడు. 40 శాతం కాలిన గాయాలతో అతనిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Also Read:దుబ్బాక ఉపఎన్నిక... బండి సంజయ్ కి హరీష్ లేఖ, మరో సవాల్

దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగయినా గెలిచి తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆ పార్టీ ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే బిజెపి కేడర్ ను టార్గెట్ చేసిన ఆయన తాజాగా బిజెపి బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. మంత్రి హరీష్ సమక్షంలో కమలాకర్ బిజెపిని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఆయనతో పాటు అనుచరులు, పలు గ్రామాల బిజెపి నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. అలాగే గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు కొందరు ఈ కార్యక్రమంలోనే అధికార పార్టీలో చేరారు.