టీఆర్ఎస్ ప్రభుత్వం మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు బీజేపీ నేత విజయశాంతి. డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాకేనంటూ రాములమ్మ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించిందని ఆమె గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ (kcr) , టీఆర్ఎస్ (trs) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ (bjp) నేత విజయశాంతి (vijayasanthi) . పటాన్ చెరులోని బీరంగూడ గుట్టపై జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమంలో (international womens day) ఆదివారం విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ను తుంగలో తొక్కాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. మహిళలు.. ఒక్కొక్కరు మిస్సైల్ లాంటి వారని .. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం అని ఆమె పేర్కొన్నారు. మహిళ అంటే భాధ్యత, బాధ్యత అంటే మహిళ అని విజయశాంతి చెప్పారు. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ అని .. సమాజంలో డ్రగ్స్‌కి బానిసై యువత… తల్లి, చెల్లి అనే బేధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లేనంటూ విజయశాంతి ఆరోపించారు.
ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా? అని ఆమె ప్రశ్నించారు. లవ్ జిహాద్ కొత్తగా వచ్చిందన్న విజయశాంతి.. రాష్ట్రంలో భద్రత లేక మహిళలు భయంతో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదని.. యూపీలో భద్రత లేని చోట ప్రధాని మోదీ (narendra modi) , సీఎం యోగి భద్రత (yogi adityanath) కల్పించారని విజయశాంతి చెప్పారు. ఉత్తరప్రదేశ్.. ఇప్పుడు మాఫియా చేతుల్లో లేదని, యోగి ప్రభుత్వం చేతుల్లో ఉందని గుర్తుచేశారు. యూపీలో బీజేపీ వరుసగా రెండోసారి గెలిచిందంటే మంచి పనులు చేయడం వల్లే అని విజయశాంతి స్పష్టం చేశారు.
ఇకపోతే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై (five state elections) ఇటీవల విజయశాంతి స్పందించారు. పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సంచలన విజయం సాధించిందని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లో 'కమలం వికసించింది... కాషాయం రెపరెపలాడింది' అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను విపక్షాలు పెద్ద బూచిగా చూపించాయనీ, ఎన్నికల ఫలితాల మీద వాటి ప్రభావం లేనే లేదని అన్నారు. అలాగే.. బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీగా, మతతత్వ పార్టీగా ప్రతిపక్షాలు ముద్రవేశాయని ఆరోపించారు. ఈ విజయం విపక్షాలకు పెద్ద చెంపపెట్టు అని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీపై ఎన్ని కట్టుకథలు అల్లినా .. ఓటర్లు నిజమేంటో గ్రహించారని చెప్పుకోచ్చారని అన్నారు.
ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నా... అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించిందని, అలాగే, హిందువులు తరతరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణంతో పాటు.... కాశీలో జ్ఞానవాపి మసీదుకు కూడా రక్షణ కల్పిస్తూ కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించిందనీ, బీజేపీ జాతి సమగ్రత, జాతీయ సమైక్యత లక్ష్యంగా బీజేపీ పాలన కొనసాగుతోందనీ, ఆ పాలనకు ఫలితమే ఈ రోజు ఎన్నికల ఫలితాలను అన్నారు. అందుకు 37 ఏళ్ల తర్వాత రెండోసారి వరుసగా యోగి సర్కారు అధికారాన్ని దక్కించుకుందని తెలిపారు. అలాగే.. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణనిచ్చింది బీజేపీ పార్టీ అని ఆమె తెలిపారు.
