Asianet News TeluguAsianet News Telugu

మీకు జీతాలిచ్చేది కేసీఆర్ కాదు... జనం, తిరగబడితే తట్టుకోలేరు : పోలీసులపై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ పోలీస్ శాఖపై మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల జీతగాళ్లలా వ్యవహరిస్తున్నారని మీకు జీతాలిచ్చేది ప్రజలు కానీ కేసీఆర్ కాదని ఆమె చురకలంటించారు. 
 

telangana bjp leader dk aruna slams police department
Author
First Published Jan 7, 2023, 8:07 PM IST

తెలంగాణ పోలీసులపై మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఫైర్ అయ్యారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వమని, ప్రభుత్వం అంటే జనాలని, అంతేకాదని కేసీఆర్ కాదని చురకలంటించారు. యూనిఫాం తీస్తే మీరు కూడా సాధారణ మనుషులేనని డీకే అరుణ పేర్కొన్నారు. ప్రజలు తిరగబడితే బయట అడుగుపెట్టలేరని ఆమె హెచ్చరించారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల జీతగాళ్లలా వ్యవహరిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. 

అంతకుముందు బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అన్నారు. కేంద్రం నిధులపై తెలంగాణ సర్కార్ తప్పుడు లేఖలు చెబుతోందని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చకు సిద్దమని ప్రకటించారు. కేంద్రం నిధులపై ఆధారాలతో సహా చూపిస్తామని అన్నారు. కేసీఆర్ రాజీనామా పత్రం పట్టుకుని చర్చకు రావాలని అన్నారు. రాజకీయాల గురించి కాదని.. అభివృద్ది గురించి మాట్లాడాలని అన్నారు. 

ALso REad: ఈ నెల 19 లేదా 20న తెలంగాణకు మోడీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్‌లో సభ..?

రైతు బంధు సొమ్మును బ్యాంకులు రుణమాఫీ  కింద జమ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదల కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా కాంగ్రెస్ తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారి ఇన్నేళ్లు గడిచినా ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు ఫిర్యాదు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం అని ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios