రోడ్డు ప్రమాదంలో తెలంగాణ బీజేపీ నేత బొడ్డు నరేందర్, ఆయన భార్య దుర్మరణం పాలయ్యారు. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేట వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నరేందర్‌తో పాటు ఆయన భార్య నాగరాణి అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. కుమార్తె దీప్తి, కుమారుడు వినయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.