తెలంగాణ బీజీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ మీద మరోసారి విరుచుకుపడ్డారు. ఆమెకు టికెట్ ఇస్తే 33 శాతం మందికి ఇచ్చినట్టేనన్నారు. 

హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే 33 శాతం మహిళలకు ఇచ్చినట్లేనంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

బండి సంజయ్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నేతలు చాలామంది బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని సర్వేలన్నీ చెబుతున్నాయని జోస్యం చెప్పారు. కెసిఆర్ తన బిడ్డ కవితకు టికెట్ ఇస్తే 33% మహిళలకు టికెట్ ఇచ్చినట్లే అంటూ ఎద్దేవా చేశారు.

బీరు బాటిల్స్ తో తలలు పగలగొట్టుకుని... వైన్ షాప్ ముందే మందుబాబుల వీరంగం

ఇప్పటికే ప్రకటించిన 115 మందిలో సగం మందికి సీఎం కేసీఆర్ బీఫామ్ ఇవ్వరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ క్యాడర్ను కాపాడుకోవడం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. అనేక సర్వేలు ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ కి 25 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నాయన్నారు. 30మంది కాంగ్రెస్ నేతలకు కేసిఆర్ డబ్బులు ఇచ్చి బరిలోకి దింపుతున్నాడు. హిందువుల ఓట్ల కోసం కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపుతున్నారు’ అని బండి సంజయ్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే సోమవారంనాడు ఆయన విజయవాడకు వెళ్లారు. అక్కడ బిజెపి ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ వైయస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో గతంలో పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బండి సంజయ్ ఇప్పుడు ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన స్టైల్ లో ప్రశంసల వర్షం కురిపించారు. అటు వైయస్ జగన్ పై విమర్శలు కురిపిస్తూనే, ఇటు పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచేతడంతో బండి సంజయ్ రూట్ మారిందా? అని చర్చించుకుంటున్నారు. గతంలో తెలంగాణలో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు పవన్ మీద ప్రశంసలు కురిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అవసరం తమకు లేదన్నారు. అప్పట్లో బండి సంజయ్ తెలంగాణ బిజెపి చీఫ్ గా ఉన్నారు. అంతేకాదు జనసేన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బిజెపితో పొత్తు అవసరం లేదని.. ఆ విషయం ప్రతిపాదనకు రాలేదని.. ఆంధ్రప్రదేశ్ లోనే జనసేనతో బిజెపికి పొత్తు అంటూ ఘాటుగా మాట్లాడారు.

ఆ సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు తీవ్ర అగ్రహావేశాలకు లోనయ్యారు. తమ అధినేతను అవమానించేలా మాట్లాడారని బండి సంజయ్ పై మండిపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో లేరు. పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఏపీలో పూర్తిగా కాకపోయినా… బిజెపి ఓట్ల నమోదు కార్యక్రమం బాధ్యతలను బండి సంజయ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడకు వచ్చిన బండి సంజయ్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఇది తన ఉనికిని చాటుకునేందుకే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు చాలా ఫాలోయింగ్ ఉందంటూ మాట్లాడారు. వైసిపి పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రను అడ్డుకోవడం హేయమైన చర్య అంటూ వైసీపీపై మండిపడ్డారు.