పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా తెలంగాణ బీజేపీ గాలిపటాలు ఎగురవేసింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సీఏఏ బిల్లుకు అనుకూలమంటూ రాసిన పతంగులను ఎగురవేశారు.

అటు తెలంగాణ భవన్‌లో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పతంగులు ఎగురవేశారు. 

రంగురంగుల పతంగులతో టీఆర్ఎస్ కార్యాలయాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.