హైదరాబాద్: టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ డా.కె.లక్ష్మణ్. మజ్లిస్ పార్టీ అజెండానే టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అని కారు డ్రైవర్ కేసీఆరే అయినా స్టీరింగ్ మాత్రం ఓవైసీ చేతుల్లో ఉందన్నారు. 

టీఆర్ఎస్ గుర్తు కారు అని కారు డ్రైవర్ కేసీఆర్ అయినా స్టీరింగ్ మాత్రం తన చేతుల్లో ఉందని ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడని ఆరోపించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలు వింటుంటే సిగ్గు అనిపించడం లేదా కేసీఆర్, కేటీఆర్ అంటూ తిట్టిపోశారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నప్పటికీ దాన్ని నడిపే స్టీరింగ్,బ్రేక్, ఎక్స్ లేటర్ మజ్లిస్ పార్టీదేనని ఎంఐఎం పార్టీ స్పష్టం చేస్తున్నా కనీసం ఖండించే పరిస్థితుల్లో కూడా కేసీఆర్, కేటీఆర్ లేరని బీజేపీ చీఫ్ లక్ష్మణ్ విమర్శించారు.