తోటి విద్యార్ధిపై దాడి.. లాయర్‌తో కలిసి పీఎస్‌కి బండి సంజయ్ తనయుడు, స్టేషన్ బెయిల్
తోటి విద్యార్ధిపై దాడికి సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తన న్యాయవాది కరుణ సాగర్‌తో కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యాడు. అనంతరం భగీరథ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
తోటి విద్యార్ధిపై దాడికి సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తన న్యాయవాది కరుణ సాగర్‌తో కలిసి దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యాడు. కేసుకు సంబంధించి దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తామని లాయర్ కరుణాసాగర్ అన్నారు. కేసు దర్యాప్తులో అవసరమైతే మళ్ళీ రావడానికి సిద్ధమన్నారు. విచారణకు అవసరమైతే పిలుస్తామని అందుబాటులో ఉండాలని దుండిగల్ ఇన్స్‌పెక్టర్ పేర్కొన్నారు. అనంతరం భగీరథ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు.
కాగా.. భగీరథ్ మరో విద్యార్థిపై దాడి చేసిన వీడియో వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. అందులో భగీరథ్.. మరో విద్యార్థిని బూతులు తిడుతూ, కొట్టడం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి మహీంద్రా యూనివర్శిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దుండిగల్ పోలీసులు సాయి భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లు 323, 341, 504, 506 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వీడియో వైరల్ అయిన కొద్ది సేపటికే..మరో యువకుడు సెల్ఫీ వీడియో రిలీజైంది.
ALso REad: బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు స్టేషన్ బెయిల్.. వెలుగులోకి మరో వీడియో..!
తన పేరు శ్రీరామ్ అని.. భగీరథ్ దాడి చేసింది తనపైనే అని చెప్పాడు. వైరల్ అవుతున్న వీడియో పాతది అని పేర్కొన్నాడు. ‘‘నేను తెల్లవారుజామున 4 గంటలకు భగీరథ్ స్నేహితుడి సోదరికి కాల్ చేశాను. నన్ను ప్రేమించమని మెసేజ్ కూడా వేధించాను. ఈ విషయం భగీరథ్‌కు తెలియగానే నా దగ్గరకు వచ్చాడు. నేను అతనితో దురుసుగా మాట్లాడాను. అతను నాపై దాడి చేశాడు. ఏది ఏమైనా ఇప్పుడు అది అంతా గతం. మేము రాజీకి వచ్చాము. ఇప్పుడు మా మధ్య ఎటువంటి సమస్యలు లేవు. మేము దానిని విడిచిపెట్టాము. మేం స్నేహితులం, బ్యాచ్‌మేట్స్. ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’’ అని ఆ యువకుడు పేర్కొన్నాడు.
వెలుగులోకి మరో వీడియో...
భగీరథ్‌కు సంబంధించి మరో వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో కూడా ఓ విద్యార్థిని భగీరథ్ బూతులు తిడుతూ కొడుతున్నట్టుగా కనిపించింది. అయితే.. ఇందులో భగీరథ్‌తో అతని స్నేహితులంతా కలిసి ఓ విద్యార్థిని బూతులు తిడుతూ, విచక్షణారహితంగా కొడుతూ, కాలితో తన్నుతూ ఉండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే వీడియోలో ఉన్న బాధిత అబ్బాయిని ఎందుకు కొట్టారనే విషయం తెలియాల్సి ఉంది.