Asianet News TeluguAsianet News Telugu

దళిత బంధు: తాను తవ్విన గోతిలో తానే పడింది.. టీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ వ్యాఖ్యలు

దళితబంధుకు (dalitha bandhu) వ్యతిరేకంగా తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ . టీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుందని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. తాను తవ్విన గోతిలో తానే పడిందంటూ సంజయ్ సెటైర్లు వేశారు. 

telangana bjp chief bandi sanjay slams trs party over dalitha bandhu
Author
Hyderabad, First Published Oct 27, 2021, 10:45 AM IST

దళితబంధుకు (dalitha bandhu) వ్యతిరేకంగా తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ (bandi sanjay). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు దళితబంధుకు సహకరిస్తున్నాయని చెప్పారు. టీఆర్ఎస్(trs) ప్రతి ఓటర్‌కు రూ.20 వేలు ఇచ్చిందని సంజయ్ ఆరోపించారు. రూ.15 వేలు మధ్యలోనే దోచేశారని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలను ఎక్కడా అడ్డుకోవద్దని చెప్పామని బండి సంజయ్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుందని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. తాను తవ్విన గోతిలో తానే పడిందంటూ సంజయ్ సెటైర్లు వేశారు. 

ఎన్నికల ప్రచారం సందర్భంగా నిన్న ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల ముందు ఇదే ప్లీనరీ (trs plenary)పెడితే కేసీఆర్ (kcr) ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్‌లో ముఖం చెల్లక ఎన్నికల సంఘంపై నిందలు వేస్తున్నరాని, భారత ఎన్నికల సంఘానికి (election commission ) ప్రపంచంలోనే మంచి పేరుందని, సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Also Read:Huzurabad Bypoll: టీఆర్ఎస్ వాళ్లిచ్చే పైసలు తీసుకోండి.. బీజేపీకి ఓటేయండి: బండి సంజయ్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో (west bengal assembly elections) ఈసీ రూల్‌తో ప్రధానమంత్రి (narendra modi) మీటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయని, ఆ రూల్స్ వల్ల అమిత్ షా (amit shah) మీటింగ్ కూడా రద్దు చేసుకున్నామని బండి సంజయ్ గుర్తుచేశారు. తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి ఉంది.. ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖలు రాసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన దుయ్యబట్టారు. దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేస్తున్నాడనిన్నారు. దళిత సీఎం ఏమైంది? ఉప ముఖ్యమంత్రి ఏమైంది? మూడెకరాల భూమి ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్. దళిత బంధుపై హుజూరాబాద్ నుంచే బీజేపీ యుద్దం ప్రారంభించబోతున్నామని, కేసీఆర్ చేసిన అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని ఖాయమై పోయిందన్నారు.

మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికకు (huzurabad bypoll) సంబంధించి ప్రచారానికి నేటితో తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులు, నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 30న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios