క్షమాపణలు చెప్పేది లేదు, తిడుతూనే వుంటా : ‘‘ఆ నలుగురు’’ అంటూ టీఎన్జీవో నేతలపై సంజయ్ విమర్శలు

టీఎన్జీవో నేతలపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని, ఇంకా తిడుతూనే వుంటానని ఆయ తేల్చిచెప్పారు. హెడ్ మాస్టర్లతో కేసీఆర్.. బాత్‌రూమ్‌లు కడిగించారని బండి సంజయ్ ఆరోపించారు. 

telangana bjp chief bandi sanjay slams tngo leaders

టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలన్న ఆయన.. తాను క్షమాపణలు చెప్పనని, మీరే చెప్పాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ఆస్తులను మొత్తం బయట పెడుతానని ఆయన హెచ్చరించారు. టీఎన్జీవో నేతలను ఇంకా తిడుతూనే వుంటానని బండి సంజయ్ తేల్చిచెప్పారు. నలుగురు టీఎన్జీవో నేతలు ఒక్కసారైనా జీతాల గురించి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. మీకు కోట్లాది రూపాయల ఆస్తులు వున్నాయని.. లోన్లు కట్టలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడి తాను జైలుకెళ్లానని.. జైలుకెళ్లింది తామని, లాఠీ దెబ్బలు తిన్నది తామని ఆయన అన్నారు. మీ పీఆర్సీ కోసం మేం కొట్లాడామని బండి సంజయ్ గుర్తుచేశారు. స్కూళ్లలో కనీసం చాక్‌పీస్‌లు లేవని, ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. హెడ్ మాస్టర్లతో కేసీఆర్.. బాత్‌రూమ్‌లు కడిగించారని బండి సంజయ్ ఆరోపించారు. మీరు నలుగురు వెళ్లి కడగాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు పిలుపునిస్తే ధర్నాకు ఎంతమంది వచ్చారని ఆయన చురకలు వేశారు. 

ALso Read:తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. కేంద్ర ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు..

తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాల వల్ల ఎంతమంది లబ్ధిపొందుతున్నారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు సంజయ్. కులాల వారీగా ఎంతమందిని గణన చేశారో చెప్పాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అక్కడ ఎంత వున్నాయో ఇక్కడ ఎంత వున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. నలుగురు ఎమ్మెల్యేలను జంతువుల మాదిరిగా పట్టుకొచ్చి కేసీఆర్ సర్కస్ ఫీట్లు చూపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటర్లకు ముఖం చూపించలేకపోతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి మొనగాడి లాగా తిరుగుతున్నాడని ఆయన అన్నారు. కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మడం లేదని.. ఆర్టీసీని నాశనం చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అశ్వత్థామరెడ్డిని ఎన్నో ప్రలోభాలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్మికులు బలికావొద్దన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios