Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. కేంద్ర ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు..

టీఎన్జీవోలపై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ  బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ మంగళవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందజేశారు. 

BJP Leader Tarun Chugh Complaint to Central election officials alleges party leaders phone tapping in munugode
Author
First Published Nov 1, 2022, 12:10 PM IST

టీఎన్జీవోలపై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ  బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ మంగళవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందజేశారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఎన్జీవోలు తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఎన్‌జీవోలు నిర్వహించిన ప్రెస్ మీట్ అంశాలను కూడా ప్రస్తావించారు. అలాగే ఫిర్యాదులో మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ నేతల ఫోన్ల ట్యాప్ చేస్తున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కూడా తరుణ్ చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇక, తెలంగాణ ఎన్‌జీవోల సంఘం నాయకులు సర్వీస్‌ రూల్స్‌ ఉల్లంఘించి టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్‌జీవోల సంఘం ఆఫీస్‌ బేరర్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా కూడా టీఎన్జీవోలు ఇలాగే వ్యవహరించారని.. అందుకు సంబందించి వారికి జరిమానా కూడా విధించారని చెప్పారు. టీఎన్జీవో అధ్యక్షుడు ఎం రాజేందర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు సమర్పించిన వినతిపత్రంలో బీజేపీ నేతలు పేర్కొన్నారు. 

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రాజేందర్‌తోపాటు వారి సంఘం అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ప్రచారం చేసినందుకు వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే దానిపైన తాము పోరాటం చేస్తామని చెప్పారు. న్యాయస్థానంలోనూ పోరాటం చేస్తామని తెలిపారు. ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఈ విధంగా వ్యవహరించడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. 

బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది రచనా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేయరాదని సర్వీస్ రూల్స్ క్లియర్‌గా ఉన్నాయని చెప్పారు. టీఎన్జీవో అసోసియేషన్‌పై క్రిమినల్ చర్యలు, డీసిప్లిన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో చేసిన తప్పే మునుగోడు ఎన్నికల్లోను చేస్తున్నారని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios