దేవాలయ స్థలాలను టీఆర్ఎస్, ఎంఐఎం గుండాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్‌ను ఓడించాలన్నదే అందరి ఆలోచన అన్నారు.

సీఎం ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. రైతులను పట్టించుకోవడం లేదని... సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ దాటి బయటకు రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ఫాంహౌస్‌లో సోదాలు నిర్వహిస్తే ఏదో ఒకటి బయటపడుతుందని.. ఆయన అక్కడో ఏదో దాచుకున్నాడని సంజయ్ ఆరోపించారు. మైలార్‌దేవ్‌పల్లి కార్పోరేటర్‌పై దాడి చేశారని.. మేం తిరిగి దాడి చేయడం పెద్ద పనేమీ కాదని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతలను తిరగనివ్వకుండా అడ్డుకోగలమని బండి సంజయ్ స్పష్టం చేశారు.