తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎప్పటికప్పుడు విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఆ కృషికి ఫలితం దుబ్బాక ఎన్నికలు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే తెలియజేస్తోంది.

ఈ సంగతి పక్కన పెడితే.. బండి సంజయ్ కి రాజకీయం మాత్రమే కాదు.. మానవత్వం కూడా బాగా తెలుసు. తాజాగా.. ఓ మహిళ విషయంలో ఆయన చేసిన పని పట్ల ప్రస్తుత్వం సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఫిట్స్‌ వచ్చి ఓ మహిళ రోడ్డుపై పడింది. పక్కనే ఉన్న కుమార్తె ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. అదే సమయంలో  జహీరాబాద్‌ నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. 

ఈ క్రమంలో చందానగర్‌కు రాగానే రోడ్డు పక్కన పడి ఉన్న మహిళను గమనించి, కారు దిగి ఆమె చేతిలో కారు తాళాలు పెట్టి కోలుకునే వరకు అక్కడే ఉండి మానవత్వాని చాటుకున్నారు. ఆ మహిళ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి  వెళ్లిపోయారు.