Asianet News TeluguAsianet News Telugu

ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తాం.. కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతాం : బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందని.. అందుకే నిన్న ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని సెటైర్లు వేశారు. 

telangana bjp chief bandi sanjay fires on cm kcr
Author
Hyderabad, First Published Aug 21, 2022, 3:44 PM IST

మునుగోడులో జరగనున్న బీజేపీ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా బయటపెడతామన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందన్నారు. అందుకే నిన్న ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని సంజయ్ విమర్శించారు. మునుగోడులో కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఈరోజు సమాధానమిస్తామని ఆయన తెలిపారు. 

ఇకపోతే.. రాష్ట్రంలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం జనగామ జిల్లా ఖిలాషపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై మరో 4 వేల కోట్ల భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో చీకట్లు అలుముకునే ప్రమాదం వుందని.. అందుకే కేంద్రం విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం విధించిందని బండి సంజయ్ అన్నారు. 

Also Read:తెలంగాణలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచే ప్లాన్.. సాకు ఇదే : బండి సంజయ్ వ్యాఖ్యలు

డిస్కమ్‌లకు తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని .. ఇవి రూ.20 వేల కోట్లకు పైగా వుండగా, తాము రూ.1380 కోట్లు మాత్రమే కట్టాల్సి వుందని కేసీఆర్ సర్కార్ నివేదిక ఇచ్చిందని బండి సంజయ్ ఫైరయ్యారు. మరో అధికారి అయితే కేవలం రూ.50 కోట్లే కట్టాల్సి వుందని అంటున్నారని, ఓ మంత్రి అయితే అసలు ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదని అంటున్నారని ఆయన మండిపడ్డారు. దీనిని సాకుగా చూపించి కరెంట్ ఛార్జీలు పెంచాలని సీఎం యోచిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios