Asianet News TeluguAsianet News Telugu

BJP: బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించింది. బీజేపీ శాసనసభా పక్ష ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమనా రెడ్డిలను నియమించింది.
 

telangana bjp appoints alleti maheshwar reddy as floor leader in assembly kms
Author
First Published Feb 14, 2024, 7:14 PM IST | Last Updated Feb 14, 2024, 7:14 PM IST

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌ను ప్రకటించింది. ఆలస్యంగానైనా ఈ నిర్ణయాన్ని తాజాగా వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ప్రకటించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కే వెంకటరమణా రెడ్డిలను శాసనసభాపక్ష ఉపనేతలుగా నియమించింది. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను బీజేఎల్పీ కార్యదర్శిగా నియమించింది.

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబును ప్రధాన విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను పార్టీ విప్‌గా నియమించినట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీ రాకేశ్‌ను పార్టీ కోశాధికారిగా తెలంగాణ బీజేపీ నియమించింది.

శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి బీజేపీ నియమించింది. ఈ కొత్త నియామకాలను తెలుపుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శాసన సభ, శాసన మండలి కార్యదర్శులకు లేఖ రాశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios