అలా అయితే కేటీఆరే సీఎం: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే కేటీఆర్ తెలంగాణకు సీఎం అవుతారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలంగాణకు కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఇతర పార్టీల నుండి సీఎం అభ్యర్ధి ఎవరని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే కేటీఆర్ సీఎం అవుతారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రపై కేసీఆర్ కేంద్రీకరించారు. మహరాష్ట్రలోని ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాది డిసెంబర్ చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనన్నాయి. ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహలు చేసుకంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకొనే ప్రక్రియలో భాగంగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే తెలంగాణకు కేటీఆర్ సీఎం అవుతారని పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్ధమౌతుంది.
గతంలో కూడ కేటీఆర్ ను సీఎం చేస్తారని ప్రచారం సాగింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారాని దాదాపుగా ఐదారేళ్లుగా సాగుతుంది. సీఎం విషయమై కేటీఆర్ గతంలో రెండు మూడు దఫాలు స్పష్టత ఇచ్చారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా మారితే కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు లేకపోలేదు.