హైదరాబాద్: ఈ నెల 9వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ నెల 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11: 30 గంటలకు ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్ లో కేటాయింపుల ఆదారంగా రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని  కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.

శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులను సమీక్షించారు. వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని తెలంగాణ  ప్రభుత్వం భావిస్తోంది. ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మెన్ శాఖల వారీగా నిర్వహించిన సమీక్షలకు సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు అందించారు.రాష్ట్రంలో ఆర్ధిక శాఖ మంత్రి లేరు. అసెంబ్లీలో కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.