ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

దీని ప్రకారం.. మార్చి 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా.. అదే రోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 16వ తేదీన దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సంతాప తీర్మానం ఉంటుంది.
ఈనెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఇక 18వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాప్రతినిధుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.