మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.   


హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

మంగళవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజున ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ భారతరత్న ఇవ్వాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సేవలను ఆయన కొనియాడారు.

also read:అవమానిస్తున్నారు: భట్టి విక్రమార్క, కౌంటరిచ్చిన మంత్రి కేటీఆర్

పీవీ చేసిన సేవలకు గాను భారతరత్న ఇవ్వాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులు ప్రసంగించారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చకు ఎంఐఎం దూరంగా ఉంది. ఈ చర్చకు ఎంఐఎం సభ్యులు గైర్హాజరయ్యారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానించిన తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.