హైదరాబాద్: నూతన రెవిన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కొత్త ముసాయిదా బిల్లుపై చర్చ జరిగింది.

ఈ బిల్లుపై పలు పార్టీల నుండి పలువురు సభ్యులు మాట్లాడారు. ఎంఐఎం నుండి అక్భరుద్దీన్ ఓవైసీ,  కాంగ్రెస్ నుండి మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, టీడీపీ నుండి సండ్ర వెంకటవీరయ్య, టీఆర్ఎస్ నుండి గువ్వల బాలరాజు, ఈటల రాజేందర్ తదితరులు ప్రసంగించారు. 

ఈ బిల్లుపై ఎమ్మెల్యేల సందేహాలపై  తెలంగాణ సీఎం కేసీఆర్  సుధీర్ఘంగా సమాధానమిచ్చారు.ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.  అయితే దీనికి కేసీఆర్ అంగీకరించలేదు.

also read:వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు వేర్వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు: కేసీఆర్

కొత్త రెవిన్యూ బిల్లు ప్రకారంగా రానున్న రోజుల్లో ఎమ్మార్వోలే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయనున్నారు. తెలంగాణ ధరణి పోర్టల్ లోనే ఇకపై రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఒకేసారి జరుగుతాయి. తప్పు చేసిన తహాశీల్దార్ పై క్రిమినల్ చర్యలు తీసుకొంటారు.  ఇక నుండి రాష్ట్రంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దైనట్టే.