హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగంణంలో మంగళవారం నాడు పాత భవనం ప్రాకారం కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అసెంబ్లీ ప్రాంగణంలో విరిగిపోయిన తూర్పువైపున ఉన్న ప్రాకారం అంచు విరిగిపోయింది.విరిగిపోయిన ప్రాకారం అంచు పెచ్చులు కింద ఉన్న గార్డెన్ లో పడ్డాయి.

 

ఈ ప్రాకారం పడిన సమయంలో భారీ శబ్దం విన్పించినట్టుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తెలిపారు. రెండు మూడు రోజుల క్రితం వరకు ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుుతున్నాయి. కానీ ఇవాళ మాత్రం ఎవరూ కూడ ఈ ప్రాంతంలో పనిచేయలేదు.

పాత భవనానికి కొద్ది రోజులుగా మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు. భవనానికి రంగులు వేయడంతో పాటు దెబ్బతిన్న భవనాన్ని మరమ్మత్తు చేస్తున్నారు. ఈ సమయంలో భవనం ప్రాకారం అంచు కూలిపోవడంతో ఉద్యోగులు  భయాందోళనలకు గురయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇదే ప్రాంతంలో ఉంది. పాత అసెంబ్లీ భవనం కాకుండా కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తోంది.