Barrelakka: బర్రెలక్క కు ఎన్ని ఓట్లు వస్తాయి? ఇంతకీ ఆమె గెలుపొందే అవకాశముందా?
Barrelakka: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టం చేయగా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్‌ఎస్‌కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఈ నేపథ్యం కొల్లాపూర్ నియోజక వర్గం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క(శిరీష) ఎన్ని ఓట్లు పొందుతుంది? ఆమె గెలుపొందే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఇంతకీ ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏమంటున్నాయో తెలుసుకుందాం.
Barrelakka: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రకాల ఏజెన్సీలు విడుదల చేసిన ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే జై కొట్టాయి. బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుందని తెలిపాయి. ఇక ఒకట్రెండు సర్వేలు మాత్రం బీఆర్ఎస్ తిరిగి అధికారం చేపడుతుందని తెలిపారు.ప్రజల్లో కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఉందనీ, ఆ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క(శిరీష) యావత్ దేశం ద్రుష్టిని ఆకర్షించింది. అయితే.. ఈ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) విజయం సాధిస్తుందా? ఆమెకు ఎన్ని ఓట్లు పడే అవకాశముంది ? అనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా పోలింగ్ ముగిసిపోవడంతో బర్రెలక్క గెలుపుపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయనే చర్చ ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో ‘ఆరా మస్తాన్ సర్వే’ కీలక ప్రకటన చేసింది.బర్రెలక్క అలియాస్ శిరీషకు దాదాపు12 వేల నుంచి 15 వేల వరకు ఓట్లు రావొచ్చని లెక్కగట్టింది. ఆమె గెలువకపోయినా ప్రత్యార్థులకు గట్టి పోటీ ఇస్తుందని, ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు భారీ సంఖ్యలో ఆమెకే పడే అవకాశముందనీ, నిరుద్యోగ, యువత ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందే అవకాశముందని విశ్లేషించింది.
ఇక ఆరా మస్తాన్ సర్వే(ప్రీపోల్ సర్వే) ప్రకారం.. కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్ 41 నుంచి 49 స్థానాల్లో గెలుపొందే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7 స్థానాల్లో, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ తన ప్రీపోల్ సర్వే వెల్లడించింది.
ఇదిలావుంచితే తెలంగాణ ఎన్నికలు -2023లో కీలక ఘట్టం పూర్తయ్యింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 67 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది? అనే విషయాలు తెలియాలంటే.. డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే..