Election Commission: కొత్త ఓటుహక్కుకు ముగిసిన దరఖాస్తు గడువు.. ఎంత మంది ఆప్లై చేసుకున్నారంటే..?
Election Commission: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఈ నెలలో వివిధ దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ప్రధానంగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించింది. అయితే.. ఈ గడవు అక్టోబర్ 31 న ముగిసింది. ఇంతకీ కొత్త ఎంత మంది ఓటు హక్కు కోసం ఎంత మంది ఆప్లై చేసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారంటే..?
Election Commission: ఎన్నికలు అంటేనే ఓటర్ల పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు .. ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ నాయకులంతా ఓటరు మహాశయులను ప్రత్యేక్షం చేసుకోవడానికి నానా ప్రయత్నాలు పడుతుంటున్నారు. ఓటు కోసం కొండ మీద కోతినైనా తెచ్చి ఇవ్వడానికి వెనుకాడారు. అసలు ఏ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తారు. నాయకులు ఇంత కష్టపడటానికి, నేతలు ఇన్ని వేశాలు వేయడానికి కారణం.. ఓటరు దగ్గర ఓ వజ్రాయుధం ఉంది. ఆ ఆయుధమే ఓటు హక్కు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసి.. ఎలక్షన్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు స్వీకరించారు. ఈ ఆవకాశం అక్టోబరు 31తో ముగిసింది.
ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం దాదాపు 10.42 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నూతన దరఖాస్తుల పరిశీలన తరువాత ఈ నెల 10 వరకు నూతన జాబితాను సిద్దం చేయనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇటీవల గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. తాజాగా ఓటు హక్కు కోసం 10.42 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.